Blogger Tips and Tricks Latest Tips For Bloggers Blogger Tricks
మహిమాన్విత పుణ్యక్షేత్రo తిరుమలగిరి
=========================
-- శిలావాల్మీకంగా అవతరించిన సాలాగ్రాం శ్రీవేంకటేశ్వరుడు.
----------------------------------------------------------------
శ్రీతిరుమలగిరి వెంకటేశ్వరస్వామి నిలయం మహిమంవితమైన పుణ్యక్షేత్రం. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో తిరుమలగిరి పుణ్యక్షేత్రం ఉంది.  శ్రీమహావిష్ణువును భూలోకంలో సాలగ్రాం రూపంలో స్వయంభూగా అవతరిస్తాడని అందుకే సాలాగ్రాం ఆరాధన ఉన్నతమని వైష్ణవ భక్తులు ప్రగాడంగా విశ్వశిస్తారు.ఈతిరుమలగిరిలో వెంకటేశ్వరుడు శిలా వాల్మీకంగా అవతరించాడు. అంటే రాతిపుట్ట. ఈ కొండమీద స్వామివారిని సేవిస్తూ మహాకాల సర్పం (ఆదిశేషుడు) తిరుగుతుంటాడని స్వయంగా చూసిన వారు చెపుతున్నారు. అందుకే రాత్రి వేళల్లో దేవతలు, ఆదిశేషుదు స్వామిని సేవిస్తారని కొండ మీదకు ఎవ్వరు వెళ్ళరు. సాహసించి వెళ్ళిన వారికి పాము బుస భయంకొలుపుతూ వినిపించటం వలన పరుగులు పెడుతూ కిందకు దిగిపొయిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇక్కడ స్వామి పాదముద్రతో ఏర్పడిన కోనేరు ఉంది. ఈనీరు ఎప్పుడూ ఆకుపచ్చగానే ఉంటుంది. ఇంకో విశేషం ఏమిటంటే స్వామివారి గర్భాలయం పక్కనే స్వయంభూ వరాహస్వామి ఉంటాడు. భక్తులు వరి, మొక్కజొన్న, పెసలు, దోసరాయలు వంటి రకరకాల ఉత్పత్తులు మొక్కులు ఈవరాహస్వామివారికే సమర్పిస్తారు. దొరబాబు, బొరబాబు అనికూదా ఇక్కడి వెంకటేశ్వరస్వామిని పిలుచుకుంటారు.
























శ్రీగరుడాచల వీరనరసిమ్హస్వామి క్షేత్రం:
========================
కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం గుండబోయినపాలెం గ్రామ పరిధిలో ఈక్షేత్రం ఉంది.
గద్దలు గూళ్ళుపెట్టే కొండమీద రాతి గుహలో వీరనరసిం హస్వామి కొలువుతీరాడు. కొందమీది నుండి జాలువారిన వర్షపుధారకు రాయి కరిగి జారుడు బండగా దర్శనమిస్తోంది. చెంచు మహాలక్ష్మీ ఆడుకొవటం వలన ఈబండపై అరిరిన జాలు కనిపిస్తుందని భక్తులు ముచ్చటగా కొలుస్తారు. కొండ అధిరోహిస్తుంటే మధ్యలో అతిచిన్న రాతి కోనేరు స్వామి పాదముద్రలా కనిపిస్తుంది. కొండ శిఖరమీద పెద్ద రాయి కనిపిస్తుంది. విచిత్రం ఈమిటంటే పానమట్టం మీద శివలింగంలా పశ్చిమం నుండి చూస్తే కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో గబ్బిళాలు అతిదగ్గరా వేలాడుతూ కనిపిస్తాయి. గర్భాలయంలో స్వామివారి భారీ ఆకృతి రాతిపై దర్శనమిస్తుంది. రంగులు వేయటం వలన స్వామివారిని పోల్చుకోగలుగుతాం. విశ్వ వైద్యునిగా భక్తుల నీరాజనాలు అందుకునే ఈస్వామి దర్శనం చేతనే గాలి, చీడ, పీడ వంటి రుగ్మతలు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని ప్రశస్తి.